Skip to main content

Posts

ఇండియా లో టాప్ పెలోషిప్

 రిసెర్చ్ కు బెస్ట్, కెరీర్ కు బూస్టు & ఇండియా లో టాప్ పెలోషిప్ వివరాలు: విద్యా నైపుణ్యాలను వెలికితీసేది రీసెర్చ్‌లే.. అలాంటి ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు ఫెలోషిప్‌ను అందజేస్తున్నాయి. రిశోధనలను ప్రోత్సహించేందుకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫెలోషిప్​ ఆఫర్​ చేస్తున్నాయి ఆయా రంగాల్లో రిసెర్చర్ల (Research)ను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా స్టైపెండ్​ (Stipend) అందజేస్తున్నాయి. ఈ ఫెలోషిప్ ప్రొగ్రాంల ద్వారా నాణ్యమైన విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు ఆర్థిక చేయూత ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చ్ స్కాలర్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అందిస్తున్న ఫెలోషిప్ వివరాలు ఇలా ఉన్నాయి గూగుల్​ పీహెచ్​డీ ఫెలోషిప్ ప్రోగ్రామ్: టెక్​ దిగ్గజం గూగుల్ కంప్యూటర్​ సైన్స్ విభాగంలో పరిశోధన చేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫెలోషిప్​ అందజేస్తుంది. కంప్యూటర్ సైన్స్ (Computer Science), సంబంధిత రంగాల్లో పరిశోధన చేస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి, వారికి పీహెచ్​డీ ఫెలోషిప్​ను ఆఫర్​ చేస్తోంది. పరిశోధన సంబంధిత కార్యకలాపాల కోసం నాలుగేళ్ల వరకు ప్రయా
Recent posts

హామీ సంతకం చేస్తున్నారా?

 హామీ సంతకం చేస్తున్నారా? కాస్త హామీ సంతకం చేస్తారా?ఈ ప్రశ్న మీ మిత్రుడో.. దగ్గరి బంధువో అడిగితే మీరేం చేస్తారు?మీ మ‌ధ్య ఉన్న స్నేహం, బంధుత్వం లేదా మొహ‌మాటంతో కాద‌న‌లేకో అంగీకరిస్తారు కదూ! గృహ, వాహన రుణాలు, వ్యాపారానికి..పెద్ద మొత్తంలో అప్పు తీసుకునే వారి విషయంలో కొన్నిసార్లు బ్యాంకులు, రుణ సంస్థలు, ఎవరినైనా హామీగా చూపించాలని కోరుతుంటాయి. నమ్మకమైన స్నేహితుడు, బంధువుల కోసం హామీగా ఉండటంలో ఇబ్బంది లేదు. అయితే, హామీ ఇస్తున్నామంటే మనకూ కొన్ని బాధ్యతలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందుకే, 'సరే'..అనే ముందు మీపై ఎలాంటి ప్రభావం..ఎంత వ‌ర‌కు..ఉంటుంతో తెలుసుకోవాలి. ఏ విషయంలోనైనా మధ్యవర్తిగా ఉన్నామంటే అర్థం.. ఇరువైపులా ఏ ఇబ్బంది వచ్చినా ప‌రిష్క‌రిస్తామని. రుణగ్ర‌హీత, సమయానికి బాకీ చెల్లించేలా చూసే బాధ్యత హామీదారుడిదే. ఒకవేళ అతను రుణాన్ని చెల్లించని సందర్భంలో హామీగా ఉన్న వ్యక్తి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు రుణ గ్ర‌హీత తీసుకుంటున్న అప్పుని.. తిరిగి తీర్చ‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న వ్య‌క్తుల‌నే హామీదారునిగా అంగీక‌రిస్తాయి. ఇంకా చెప్పాలంటే, హామీదారుడు కూడా ఒక‌ర‌కంగా రుణ గ్ర‌హీతే.

స్థానిక సెలవు ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి?

 స్థానిక సెలవు - స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి ఏప్రిల్ వరకు) మూడు రోజులు "స్థానిక సెలవులు" స్వయం నిర్ణయ సెలవు దినాలుగా ప్రకటించే అధికారం  ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కల్పించారు. అయితే పర్యవేక్షణ అధికారులకు ముందుగా తెలియజేయాలి. As per the G.O.Ms.No.308 Edn తేది:19-02-1970 LOCAL HOLIDAYS ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? లోకల్ హాలిడేస్ విద్యా సంవత్సరంలో 3 కు మించి (జూన్ నుండి ఏప్రిల్) ఇవ్వరాదు. LH ప్రకటించడానికి  అవకాశమున్న రోజులలో కొన్ని ఉదాహరణకు  మాత్రమే గ్రామ దేవత పండుగ స్ధానిక జాతర ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశి నాగుల చవితి కార్తీక సోమవారం దీపావళి ముందు రోజు మహా శివరాత్రి మరుసటి రోజు  హేబిటేషన్/పాఠశాల పరిధిలో  అత్యంత ప్రాధాన్యత కల్గిన/ అవసరమైన రోజు గమనిక: School Level Local Holidays ముఖ్యమైన/ స్థానిక ప్రాధాన్యమున్న రోజున "విద్యార్ధుల కోరిక మేరకు సహోపాధ్యాయులతో సంప్రదించి MEO/DEO కు ముందు సమాచారం ఇచ్చి" ప్రధానోపాధ్యాయుడు LH ప్రకటించవచ్చు

లాటరల్ థింకింగ్ అంటే ఏమిటి?

 ప్రశాంత్ కిషోర్ !  అందరికీ ఈ పేరు ఇప్పుడు సుపరిచితమే ! అనేక రాజకీయ పార్టీలు  ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొన్నాయి ... నియమించుకొంటున్నాయి .. నియమించుకొంటాయి . ఇప్పుడు ఇలాగే మరో వ్యూహకర్త సునీల్ .  వీరి వ్యూహాలు , వాటి వల్ల సమాజానికి జరిగే లాభం ఎంత ?నష్టం ఎంత ? ప్రజాస్వామ్యానికి ఇది మంచి చేస్తుందా? లేక చెడా? ఈ చర్చ వేరు . ఈ పోస్ట్ దాని పై కాదు .  ప్రశాంత కిషోర్ ఆదాయం ఎంత ఉంటుంది ? బహుశా వందల కోట్లు . ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఇంత సంపాదన . సంపాదనకు మించి పేరు ప్రతిష్టలు . పలుకుబడి ? ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ముఖ్య మంత్రులను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది ? ఇక్కడేమో ముఖ్య మంత్రులే ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం ఎదురు చూసే స్థితి .  పదేళ్ల క్రితం ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఎవరైనా ఊహించారా ? ప్రపంచం లో ఏదైనా యూనివర్సిటీ ఇలాంటి కోర్స్ ను డిజైన్ చేసిందా ? లేదు కదా . మరి ప్రశాంత్ కిషోర్ కు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ? దీన్నే  లాటరల్  థింకింగ్ అంటారు . భిన్న కోణం లో ఆలోచించడం . మీరు టాక్సీ ఓనర్ కావాలంటే ? లోన్ తీసుకోవాలి . కారు కొనాలి . డ్రైవర్ ను పెట్టుకోవాలి . దానికొక ఆఫీస్ . ఇల

మహిళలకు పేపర్ లెస్ లోన్సు

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు కాగితరహిత (పేపర్‌లెస్‌) పద్ధతిలో రుణాలను మంజూరుచేసే విధానం త్వరలో అందుబాటులోకి రానున్నది.  మహిళలకు పేపర్ లెస్ లోన్సు స్త్రీనిధిలో ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంటేషన్‌ ఐరిస్‌, వేలిముద్రతో ఈ-సైన్‌ జనరేషన్‌ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి ఇందుకోసం స్త్రీనిధి సంస్థ ఎలక్ట్రానిక్‌ లోన్‌ డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ఐరిస్‌, వేలిముద్రల ఆధారంగా ఎలక్ట్రానిక్‌ సిగ్నేచర్‌ (ఈ-సైన్‌)ను అమల్లోకి తీసుకొచ్చి రుణాల మంజూరును పేపర్‌లెస్‌గా మార్చనున్నది. ఇప్పటికే ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఆధార్‌, ఇతర వివరాలన్నీ గ్రామ సమాఖ్యల వద్ద గల ట్యాబ్‌లు, పర్సనల్‌ కంప్యూటర్ల (పీసీ)లో నిక్షిప్తమై ఉన్నందున ఈ-డాక్యుమెంటేషన్‌ సులభతరం అవుతుంది. బయోమెట్రిక్‌ ఆధారంగా రుణపత్రాల్లో సభ్యురాలు సంతకాలు చేసిన సమయం, తేదీలు ఆటోమెటిక్‌గా జనరేట్‌ అవుతాయి. అనంతరం వాటిని సర్వర్‌లో సేవ్‌ చేస్తారు. ఆ వివరాలను ఎప్పుడుకావాలంటే అప్పుడు పొందవచ్చు. ఈ విధానంలో ఎలాంటి మోసాలకు, జాప్యానికి ఆస్కారం ఉండదు పారదర్శకంగా రుణప్రక్రియ: స్త్రీనిధిని పేపర్‌లెస్‌ చేయాలనేది మా ఉద్దేశం. దీనిలో

విండోస్‌ 11లో ఈ ఫీచర్ల గురించి తెలుసా?

మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) విండోస్ 11ను గతేడాది అక్టోబరులో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, విండోస్‌ 11లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. మరి విండోస్‌ 11లో  ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్లేంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామా.. టాస్క్‌బార్‌లో కొత్తగా..: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11 వెర్షన్‌లో కొత్తగా లొకేషన్‌ ఆధారంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనిపై క్లిక్‌ చేయగానే వాతావరణ వివరాలను తెలిపే విడ్జెట్‌ ప్యానెల్‌ ఓపెన్‌ అవుతోంది. ఈ ఫీచర్‌ ఎనెబుల్‌ చేసుకోవాలంటే.. టాస్క్‌బార్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెథర్‌ విడ్జెట్స్‌ (Weather Widgets)ను ఎనెబుల్‌ చేసుకోగానే వాతావరణ సమాచారం టాస్క్‌బార్‌లో ప్రత్యక్షం అవుతోంది. మైక్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసుకొండిలా..: విండోస్‌ 11 అప్‌గ్రేడ్‌ అయిన సిస్టమ్స్‌లో టాస్క్‌బార్‌లో కుడి పక్కగా ఉన్న మైక్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసుకోవడానికి ఇక ప్రత్యేకంగా దాన్ని ఓపెన్‌ చేయాల్సిన పనిలేదు. దీనికోసం ఒక షార్ట్‌ కట్‌ కీ  “Windows + Alt + K” న

వాహనదారుల పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్

వాహనదారులకు గుడ్ న్యూస్. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్.. చెల్లింపులకు ఆన్ లైన్ పోర్టల్. TS Traffic Challan Discount on Pending E Challan. మీ బండిపై ఉన్న చలాన్‌పై డిస్కౌంట్ ఎంతో తెలుసా?  Traffic Challans Discount: పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలు రాయితీపై ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టత ఇచ్చారు. మార్చి 1 నుంచి 31 వరకు పెండింగ్‌ చలానాలు చెల్లించవచ్చని ప్రకటించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ కల్పిస్తారు. 4 చక్రాల వాహనాలకు జరిమానాలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.  https://echallan.tspolice.gov.in/publicview/  ( TS Traffic Challan Discount on Pending E Challan)