Skip to main content

ఇండియా లో టాప్ పెలోషిప్

 రిసెర్చ్ కు బెస్ట్, కెరీర్ కు బూస్టు & ఇండియా లో టాప్ పెలోషిప్ వివరాలు: విద్యా నైపుణ్యాలను వెలికితీసేది రీసెర్చ్‌లే.. అలాంటి ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు ఫెలోషిప్‌ను అందజేస్తున్నాయి. రిశోధనలను ప్రోత్సహించేందుకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫెలోషిప్​ ఆఫర్​ చేస్తున్నాయి


ఆయా రంగాల్లో రిసెర్చర్ల (Research)ను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా స్టైపెండ్​ (Stipend) అందజేస్తున్నాయి. ఈ ఫెలోషిప్ ప్రొగ్రాంల ద్వారా నాణ్యమైన విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు ఆర్థిక చేయూత ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చ్ స్కాలర్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అందిస్తున్న ఫెలోషిప్ వివరాలు ఇలా ఉన్నాయి


గూగుల్​ పీహెచ్​డీ ఫెలోషిప్ ప్రోగ్రామ్: టెక్​ దిగ్గజం గూగుల్ కంప్యూటర్​ సైన్స్ విభాగంలో పరిశోధన చేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫెలోషిప్​ అందజేస్తుంది. కంప్యూటర్ సైన్స్ (Computer Science), సంబంధిత రంగాల్లో పరిశోధన చేస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి, వారికి పీహెచ్​డీ ఫెలోషిప్​ను ఆఫర్​ చేస్తోంది. పరిశోధన సంబంధిత కార్యకలాపాల కోసం నాలుగేళ్ల వరకు ప్రయాణ ఖర్చులతో సహా రూ. 36 లక్షలు అందజేస్తుంది. అంతేకాదు, వారిని గూగుల్​ రిసెర్చ్‌​ మెంటర్స్​గా నియమిస్తుంది


ఐసీఎంఆర్​ సెంటెనరీ-పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్‌ ఫెలోషిప్ స్కీమ్

రిప్రొడెక్టివ్​ హెల్త్​, బేసిక్​ సైన్స్ (Basic Science)​:  కమ్యూనికేబుల్ డిసీజెస్​, న్యూట్రీషియన్​ అంశాల్లో రిసెర్చ్‌​ను ప్రోత్సహించేందుకు ఐసీఎంఆర్​ సెంటెనరీ పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్‌​ ఫెలోషిప్​ స్కీమ్​ను ప్రారంభించింది.​ పీహెచ్​డీ, ఎండీ, ఎంఎస్​ డిగ్రీ హోల్డర్‌లకు మద్దతు ఇవ్వడమే ఈ ఫెలోషిప్ ప్రధాన లక్ష్యం. అభ్యర్థులు పీహెచ్​డీ(PhD), ఎండీ, ఎంఎస్​ పూర్తి చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.50,000 ఫెలోషిప్​ అందజేస్తారు.

నేషనల్ పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ, ఎండీ, ఎంఎస్​ డిగ్రీ పూర్తి చేసిన​ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్​ను ఆఫర్​ చేస్తోంది. ఎంపికైన విద్యార్థులకు ప్రతినెలా రూ. 55,000 ఫెలోషిప్​తో పాటు, ఇతర ప్రయోజనాలంటాయి. సంవత్సరానికి రూ. 2 లక్షల రిసెర్చ్‌​ గ్రాంట్‌ (Research Grant)ను కూడా గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

యూజీసీ నెట్​ జూనియర్ రిసెర్చ్‌ ఫెలోషిప్: యూజీసీ నెట్​ జూనియర్ రిసెర్చ్‌ ఫెలోషిప్ (Junior Research Fellowship​) 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు అందజేస్తుంది. ఈ స్కాలర్‌షిప్​కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. యూజీసీ నెట్​ పరీక్షను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి నెలవారీ గ్రాంట్ కింద రూ. 14 వేలు అందజేస్తారు. అదనంగా ప్రతి సంవత్సరం రూ. 25 వేలు ఎమర్జెన్సీ అలవెన్స్​ కూడా అందజేస్తారు.


ప్రైమ్ మినిస్టర్ రిసెర్చ్‌ ఫెలోషిప్ (PMRF): పరిశోధన రంగంలో పనిచేస్తున్న ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం పీఎంఆర్​ఎఫ్​ మంజూరు చేస్తుంది. ఐఐటీలు, ఐఐఎస్సీల్లో పీహెచ్​డీ చేస్తున్న 1000 మందిని ఎంపిక చేసి ఈ ఫెలోషిప్​ ఆఫర్​ చేస్తుంది. 

ఈ ఫెలోషిప్ కింద ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.75,000 మంజూరు చేస్తారు పిహెచ్‌డి, ఎంటెక్ స్కాలర్‌ (MTech Scholars)లు కూడా ఈ స్కీమ్​ కింద ప్రయోజనం పొందడానికి అర్హులు.


కోడ్ ఇండియా ఫెలోషిప్: సమాజంలోని అణగారిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు కోడ్​ ఇండియా ఫెలోషిప్​ను ఆఫర్​ చేస్తోంది. ఈ ఫెలోషిప్ చిన్న పిల్లలకు ప్రోగ్రామింగ్ లేదా కోడింగ్ పాఠాలు నేర్పడానికి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్న్‌షాలా ద్వారా ఆరు నెలల పాటు జావా, జావాస్క్రిప్ట్, పైథాన్, సి ప్రోగ్రామింగ్, సి++ ప్రోగ్రామింగ్ గురించి అవగాహన కల్పిస్తుంది. ఈ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.25000 స్టైఫండ్ అందజేస్తుంది.


మ్యాథ్స్​ ఎడ్యుకేషన్​ రిసెర్చ్​ ఫెలోషిప్: గణితంలో రిసెర్చ్‌​ను ప్రోత్సహించేందుకు మ్యాథ్స్​ ఎడ్యుకేషన్ (Math Education)​ రిసెర్చ్​ ఫెలోషిప్​ ఆఫర్​ చేస్తోంది. అసెస్‌మెంట్‌లు/వర్క్‌షీట్‌ల కోసం కంటెంట్‌ను డెవలప్ చేయడం, కన్సల్టింగ్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడం, సోక్రటిక్ డైలాగ్‌లను ఎగ్జిక్యూట్​ చేయడం, గణితశాస్త్రం గురించి కథనాలను చదవడం, రాయడం వంటి అసెస్​మెంట్ల ద్వారా ఫెలోషిప్​కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం ఆరు నెలల వ్యవధి గల ఈ ఫెలోషిప్​ కింద నెలకు రూ. 4000 నుంచి రూ. 6000 స్టైఫండ్ అందజేస్తారు

Comments

Popular posts from this blog

TS SSC Supplementary Exams 2018 Results Released Check now

TS SSC Supplementary Exams 2018 Results Released Check now TS SSC Supplementary Exams 2018 Results: Telangana/TS SSC 2018 Supplementary Exams results, TS SSC June 2018 Results,bsetelangana.org results,10th class supplementary results 2018,SSC ASE 2018, SSC Supplementary Results, SSC June 2018 results,  The Board of Secondary Education(BSE), Telangana Hyderabad officials issued the Telangana State SSC advanced supplementary examinations June 2018 Time Table on May 3, 2018 and supplementary examinations are scheduled from 05/06/2018 to 19/06/2018. SSC 2018 advanced supplementary exams were conducted successfully by the Board of Secondary Education, Telangana Hyderabad.  The examinations were held June 04 to June 19, 2018 in T state for only SSC March/April 2018 failed candidates. The SSC board was completed the evaluation process of supplementary exams papers. Now Telangana State will be released by the Hon'ble Dy.CM & Minister for School Education on 07.07.2018 at 4pm at...

TSPSC Gurukulam PGT, TGT Languages Screening Test 2017 Result, Answer Key @tspsc.gov.in

TSPSC Gurukulam PGT, TGT Languages Screening Test 2017 Result, Answer Key @tspsc.gov.in: Telangana State Public Service Commission (TSPSC), Hyderabad has successfully conducted Gurukulam Combined and Common Preliminary Exam 2017 on june 14th. A huge number of candidates who applied for TSPSC Gurukulam Combined and Common Preliminary Exam 2017, have appeared for the exam at various centers in the state. Now, They all eagerly waiting for TSPSC Gurukul Teacher Answer Key 2017. Now that the test is over, TSPSC will publish the Gurukulam teacher screening test key along with the question paper at the official website, www.tspsc.gov.in. After the keys are out,  The candidates can check them from the official website or follow the steps provided below. TSPSC Gurukulam Combined and Common Preliminary Exam 2017 Result, Answer Key @tspsc.gov.in The candidates will have to sit for the preliminary screening test. Those who clear it will be called to appear for the main (objective ty...

విండోస్‌ 11లో ఈ ఫీచర్ల గురించి తెలుసా?

మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) విండోస్ 11ను గతేడాది అక్టోబరులో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, విండోస్‌ 11లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. మరి విండోస్‌ 11లో  ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్లేంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామా.. టాస్క్‌బార్‌లో కొత్తగా..: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11 వెర్షన్‌లో కొత్తగా లొకేషన్‌ ఆధారంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనిపై క్లిక్‌ చేయగానే వాతావరణ వివరాలను తెలిపే విడ్జెట్‌ ప్యానెల్‌ ఓపెన్‌ అవుతోంది. ఈ ఫీచర్‌ ఎనెబుల్‌ చేసుకోవాలంటే.. టాస్క్‌బార్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెథర్‌ విడ్జెట్స్‌ (Weather Widgets)ను ఎనెబుల్‌ చేసుకోగానే వాతావరణ సమాచారం టాస్క్‌బార్‌లో ప్రత్యక్షం అవుతోంది. మైక్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసుకొండిలా..: విండోస్‌ 11 అప్‌గ్రేడ్‌ అయిన సిస్టమ్స్‌లో టాస్క్‌బార్‌లో కుడి పక్కగా ఉన్న మైక్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసుకోవడానికి ఇక ప్రత్యేకంగా దాన్ని ఓపెన్‌ చేయాల్సిన పనిలేదు. దీనికోసం ఒక షార్ట్‌ కట్‌ కీ  “Windows + A...