స్థానిక సెలవు - స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి ఏప్రిల్ వరకు) మూడు రోజులు "స్థానిక సెలవులు" స్వయం నిర్ణయ సెలవు దినాలుగా ప్రకటించే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కల్పించారు. అయితే పర్యవేక్షణ అధికారులకు ముందుగా తెలియజేయాలి. As per the G.O.Ms.No.308 Edn తేది:19-02-1970
LOCAL HOLIDAYS ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి?
లోకల్ హాలిడేస్ విద్యా సంవత్సరంలో 3 కు మించి (జూన్ నుండి ఏప్రిల్) ఇవ్వరాదు. LH ప్రకటించడానికి అవకాశమున్న రోజులలో కొన్ని ఉదాహరణకు మాత్రమే
- గ్రామ దేవత పండుగ
- స్ధానిక జాతర
- ముఖ్యమైన పండుగ
- తొలి ఏకాదశి
- నాగుల చవితి
- కార్తీక సోమవారం
- దీపావళి ముందు రోజు
- మహా శివరాత్రి మరుసటి రోజు
- హేబిటేషన్/పాఠశాల పరిధిలో
- అత్యంత ప్రాధాన్యత కల్గిన/ అవసరమైన రోజు
గమనిక: School Level Local Holidays ముఖ్యమైన/ స్థానిక ప్రాధాన్యమున్న రోజున "విద్యార్ధుల కోరిక మేరకు సహోపాధ్యాయులతో సంప్రదించి MEO/DEO కు ముందు సమాచారం ఇచ్చి" ప్రధానోపాధ్యాయుడు LH ప్రకటించవచ్చు
Comments
Post a Comment