Skip to main content

Posts

Showing posts from February, 2022

స్విప్ట్ అనగా నేమి? దాని చరిత్ర సంగతేంటి? (What is SWIFT?)

స్విప్ట్ అనగా నేమి దాని చరిత్ర సంగతేంటి: ఇది ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగించే నెట్‌వర్క్‌. దీని పూర్తిపేరు సొసైటీ ఫర్‌ వరల్డ్‌ వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలీ కమ్యూనికేషన్‌ (Society For Worldwide Interbank Financial Telecommunication) సంక్షిప్తంగా స్విఫ్ట్‌ (Swift) అని పిలుస్తారు ట్రిలియన్‌ డాలర్ల విలువైన లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తుంది:  ప్రపంచ వ్యాప్తంగా 11,000 కంటే ఎక్కువ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్విఫ్ట్​ సేవలు అందిస్తుంది. ఇది సురక్షిత సందేశ వ్యవస్థ. త్వరితగతిన సరిహద్దు చెల్లింపులను సులభతరం చేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఫైనాన్సింగ్‌ కోసం ప్రధాన యంత్రాంగం. 1973లో బెల్జియంలో స్థాపించబడింది. 200 కంటే ఎక్కువ దేశాల్లోని బ్యాంకులు ఈ వ్యవస్థకు అనుసంధానించ బడివున్నాయి. అధికారికి వెబ్‌సైట్‌ ప్రకారం ప్రతిరోజు 40 మిలియన్లకు పైగా సందేశాలు పంపబడుతాయి. అదే సమయంలో ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల మధ్య ట్రిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరుగుతాయి ఎలా పనిచేస్తుంది? సభ్యులైన ప్రతి సంస్థకు బ్యాంకింగ్‌ ఐడెంటిఫికేషన్‌ కోడ్‌ (స్విప్ట్‌ కోడ్‌)ను కేటాయిస్తారు