మాటలతోనే టైపింగ్!. 'రాయటానికి సమయం లేదు. చేతికి ఏదో దెబ్బ తగలటం వల్ల రాయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వాయిస్ టైపింగ్ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ డాక్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
- వర్డ్‌లో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే హోం మెనూలోంచి డిక్టేషన్ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి.
- విండోస్ కీ, హెచ్ కీ.. రెండింటినీ కలిపి నొక్కినా డిక్టేషన్ టూల్బార్ కనిపిస్తుంది.
- తర్వాత మైక్ మీద క్లిక్ చేసి ఇంగ్లిషులో మాట్లాడితే చాలు.
- టెక్స్ట్ ఇంగ్లిషులో టైప్ అవుతుంది.
- విరామ చిహ్నాలు జతచేయాలంటే వాటిని స్పష్టంగా పలకాల్సి ఉంటుంది.
- గూగుల్ డాక్స్‌లో కూడా టూల్స్ మెనూలోకి వెళ్లి, వాయిస్ టైపింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- అనంతరం మైక్‌ను ఎంచుకొని మాట్లాడితే టైప్ అవుతుంది.
Comments
Post a Comment